మ్యూజియమని అడుగుపెడితే అంతా పాతవాసన. విరిగిన కత్తులు.. చిరిగినచీరలు. బండరాళ్ల పై అర్ధంకాని అక్షరాలు..
అది రాణీ గారి ముతక పెళ్లి చీర ఇది రాజు గారి అంగవస్త్రం…
ఇవన్నీ చూడాలంటె వదిలించుకోవాలి మన పైకం!
మా తాతలు నేతులు త్రాగారు మా మూతులు వాసన చూడండనే చందం.
గోడలపై అన్నీ జీవం లేని నిశ్చల చిత్రాలే …
వేటాడిన పులితో రాజు గారి ఠీవీ .. చూస్తే ఏముంది అందులో మూగజీవి జాలి చూపు తప్ప. రాకుమారుని మోములో బంధింపబడిన బాల్యం. రాకుమార్తె కురులలో.. ఎగరలేని స్వేచ్ఛ.
ప్రక్కగా చూస్తే .. కనిపించని రక్తపు టేరులపై కట్టించిన విజయ స్థూపాలు.
నవాబు గారి ఖరీదైన హుక్కా వెనుక కనిపించే ..శిస్తు కట్టిన రైతు వెత.
బేగం ఎక్కే పల్లకీ పై కనిపించే బోయి భుజం పుండు రక్తపు చారిక.
ప్రజల సొమ్ము రాళ్ళ పాలు చేస్తూ చెక్కించిన శిల్పాలు. వాటి వెనుక కనిపించే పుళ్ళు పడిన శిల్పుల నైపుణ్యం.
సింధు నాగరికత నుండి నవనాగరికత వైపు వెళ్తున్నా.. అప్పటికీ.. ఇప్పటికీ మారని చరిత్ర.
ముందు తరం భవిష్యత్తుకై ఆలోచనలు మాని వెనుక తరం చరిత్ర పుటలు తిరగేస్తూ.. వారి అవశేషాలుకై ఉన్న భూమి త్రవ్వేస్తూ.. దొరికిన వాటిపై తలలు బ్రద్దలుకొట్టుకొంటూ వ్యర్ధ ప్రయత్నాలు.
గడిచిన గతాన్ని గుర్తుచేస్తూ.. మ్యూజియం.!
బయటకు వస్తే కనిపించే.. బిచ్చగాడి చేతులో చిప్ప త్రవ్వకాలలో దొరికిన ఆదిమానవుని అవశేషంలా!!!
Like Us
గంటుమూటె : మూటకట్టుకున్న జ్ఞాపకాలు
జీవన రమణీయం-86
లోకల్ క్లాసిక్స్ – 5: బారువా ఊహాల్లో ఆమె!
కావ్య పరిమళం-19
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-5
All rights reserved - Sanchika™