సంచికలో తాజాగా

పాఠకుల అభిప్రాయాలు

 • From కస్తూరి మురళీ కృష్ణ on పాదచారి-3

  పాదచారీ
  నీ విప్లవం నీ కారుణ్యం నీ ప్రేమ​
  నీ ప్రకృతి నీ ఆశాభావం​
  నీ పిచ్చితనం వెరశి నీ పాదచారి (నవలా?)​
  3 భాగాలు పూర్తిగా చదివాను.​
  ‘పరిచిన హృదయం – పగిలిన అద్దం’ లాంటి​
  వాస్తవ కరకు సమాజం.​
  ఎంతో భావావేశం… నిజాన్ని పచ్చిగా​
  చూపాలనే తపన -​
  వెరీ డెలిబరేట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్.​
  అది పాఠకుల హృదయాల్ని స్పృశించి​
  తీరుతుంది.​
  సమాజాన్ని సైతం తాగేసేంత ఉద్రేకం​
  జాలి మనసులో చిన్న చీమకి కూడా​
  అపకారం చెయ్యని ప్రేమ…​
  నాజూకైన హృదయం​
  ఎన్నో చెయ్యాలనే కొండంత తపన​
  ఆకాశాన్ని మింగేసేంత ఆవేశం​
  నీ చేతులు చాలా కళాత్మకంగా ఉంటాయి…​
  అందుకే కథని అందమైన శిల్పంగా​
  చెక్కుతున్నావు​
  నువ్వో ఎర్రబస్సువి​
  ఓ వెర్రి బాగులోడివి​
  ఈ ‘పాదచారి’ మొదలెట్టినప్పుడు నీకెన్నేళ్ళు?​
  – ‘శివంగి’.​

  Go to comment
  2019/08/20 at 9:54 am
 • From కస్తూరి మురళీ కృష్ణ on పాదచారి-3

  ఇది యామిని దేవి కోడే గారి అభిప్రాయం

  మనిషికీ మనసుకూ మద్య ఊసులు
  పాదచారి వెంట పాత్రలు..
  ఎవరి లోకంలో వారిని ఉండనివ్వక సత్యమేమిటో చూపిస్తాయి.
  నిత్యం వైపు నడిపిస్తాయి.

  కావాలనుకున్న కాంతి నక్షత్రం
  దూరపు కొండ.. మనిషికీ మనసుకూ మద్య శ్వాసలూ.. నిట్టూర్పులూ.. ఎన్ననీ.. చెప్పలేనన్ని శ్వాసలు ఎదురుగా నిలిచి నిలతీస్తున్నాయి.

  రేయి.. పగలు చీకటి.. వెలుగు ఇలా అనేకం వెలిగి ఆరే నక్షత్రాలు.. ఎంత చక్కటి పోలికలివ్వన్నీ.. జీవితం క్షణకాలపు బంగురం అనే మాట ఎందుకో నా కిప్పుడు గుర్తు వచ్చింది..

  ఈ ప్రస్తావన ఇప్పుడు సరైనదో కాదో కానీ.. నాకు అదే అనిపించిది.
  ఏదో ఉందనుకోవడం.. కావాలనుకోవడం..
  ఊహలో ఉన్నదీ.. కావాలనుకున్నదీ..
  అప్పుడే తెలిసింది తృప్తి అనేది ఉండేది ఎక్కడని.

  పాదచారి పార్కులో ప్రేమికుణ్ణి అడిగే ప్రశ్న ఆలోచన రేకెత్తించదూ..
  నక్షత్రాలను అడిగే ప్రశ్నలు కూడా అంతే ఆలోచనలో పడేసాయి.
  ఈ ఆరోమెట్టు కథే నాక్కావాల్సిందనిపించిందిప్పుడు.. చేరవలసిన తీరమేదో అక్కడే ఉన్నట్టుంది..
  నిన్నంటే నిన్ను కాదు.. నాలో దాచుకున్న నన్ను.

  నీ నీడలో నేనున్నా.. నన్ను ప్రేమించవూ.. మనసుతో అడిగితే పులకించిన ప్రకృతి .. గలగలమని చప్పుడు చేసి ఊసుల బాసలు చేసిన ఆకులు..

  ఆశల స్కూటరు నడిపే స్వప్న మూర్తిని చూస్తే.. ఆశల సౌధం కట్టుకుని ఊహల మేడలో ఆమెకై పడే ఆరాటాన్ని చూడవచ్చు.
  ఎవరో తెలియదు.. కానీ.. ఐక్యం కాలేదని దిగులు చెట్లు పాతుకుంటాడతను.. మనిషిలోని ఆ స్వప్నికుడు.!

  చేతుల మాల చెట్టు కేస్తే చిటుక్కున కుట్టిన చిట్టి చీమ.. ఎందుకంటే అప్పుడు కదా చెప్తుంది అసలు నిజం..
  మనసు నుంచీ విడివిడి మనిషివలే మసలి.. ప్రకృతి నుండి విడివడుతున్నావనే ఎరుక చేయడానికే కుట్టిన చీమ
  సమస్త జీవజాలంతో సంచారం చక్కటి అనుభవ సారమనిపించదూ..

  ఫలాలేరుకోవడం.. సేదతీరడం.. ప్రకృతిని ఆశ్వాదించడం..
  కుక్కపిల్ల సావాసం..
  అసలు ప్రశ్న.. అవసరమైన ప్రశ్న.. నువ్వు ఎవరూ? నేను ఎవరూ?

  నిద్రలో.. కలలు.. అందులో కథల్లాంటి కలలు.

  నీవనే నీవంటే..??
  తర్కం అనే రెండు వైపులా పదునైన కత్తిని ధర్శించాక నిజం ఆచూకీ.. సత్యం యొక్క స్థానం రెండు కనిపిస్తాయి.

  కొండ కోనల నుండీ భూమి ఆకాశాలవరకూ.. సముద్రం గర్భం నుండీ ఎత్తైన పర్వత శిఖరాల వరకూ మనిషి ఆశలు, నిశ్వాసలున్నాయి అనే సత్యం ఎరుకలోకి వచ్చాక గుండెల్లో ఆనందం వ్యాకోచించి పెదవులపై చిరునవ్వుగా పరచుకుంది.

  ఆ దృశ్యాదృశ్యాలు..
  ఆ అనుభూతులన్నీ
  మాయ ఏదో నిజం ఏదో చూడమని చెప్పినట్టు అనిపించిది.

  నీ కళ్ళకు కనిపించేది దౌర్భాగ్యం
  నా కంటికి రుచించేది సౌందర్యం అన్న
  భావం లో రమించు వాడిని తెచ్చి.. వాస్తవాన్ని రుచి చూపడం బావుంది.

  వంటిని విస్తరి చేసిన పసితనాలెన్నో..
  ఆ తర్వాత చివరి పేరా వరకూ మనసు మెలిక పడింది
  పలయనానికీ.. విప్లవానికీ మద్య తేడా సున్నితంగా తెలియజెప్పడం ఆలోచనలో పడేయక మానదు.
  పాదచారి వెంట అన్ని పాత్రల్లో.. కలగలిసిపోయాను.
  ఆ అడుగుల్లో నేనింకిపోయాను. ఇంకా మరలా చూడాలి.. ఇంకా నేను అనుభూతి చెందిన భావాలు ఏదైనా చేర్చడానికి..

  Go to comment
  2019/08/19 at 9:42 pm
 • From BHUVANACHANDRA on పాదచారి-3

  చదువరుల౦దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.ఈ ”’పాదచారి ”’ తోటలో పెరిగిన మొక్క కాదు .అడవిలో స్వేచ్చగా పెరిగిన వృక్షం . ఇదో అంతరంగ పయనం.ఇందులో సస్పెన్స్ వుండదు.శృంగార ,వీర రసాల్లాంటి రసాలు వుండవు ….చక్కిలిగింతలు పుట్టించే ప్రేమ సంభాషణలు వుండవు .ఉన్నది ఎదో
  ఓపెన్ గానే వుంది . మీరూ నాతోపాటు పయనిస్తున్నందుకు మీకు నా సాష్టాంగనమస్కారాలు .
  అభిప్రాయాలు అందించిన ,అందిస్తున్న అందరికీ మరీ మరీ నా ధన్యవాదాలు .
  మీఅభిప్రాయాలు తెలియజేస్తే ఎంతో సంతోషిస్తానని మనవి చేస్తూ
  మీ
  భువనచంద్ర

  Go to comment
  2019/08/19 at 5:15 pm
 • From Anandrao Patnaik on జీవన రమణీయం-69

  4.07.2008 మద్యాహ్నాం 2 గంటల సమయం పెన్ హిల్టన్ హోటలులో ఎస్సెక్సు విభాగం లో సాహితీ సమావేశం..గుర్తుందా మ్యాడమ్..మొదటి వరసలో నేను, మీరు, గొల్లపూడివారు కూర్చున్నాం.నా కధల సంపుటి..అమూల్యకానుక..వంగూరువారు అవిష్కరించారు.అశోక తేజ, చిట్టెన్ రాజుగారు, మారుతీరావుగారు వేదిక అలంకరించగా కవితా పఠనంలో నా కవిత..గ్రామీణ నిశ్శబ్దం..చదివి వినిపించడం..నాటి కార్యక్రమంలో మీరు నా కెమేరాలో తీసిన ఫోటోలు ఇప్పటికీ నా ఆల్బంలో పదిలపరచుకొన్నాను సుమండీ.జీవన రమణీయం చదువుతుంటే మధురానుభూతుల మధ్య మిమ్మల్ని ఓసారి పలుకరిద్దామని..
  ఆనందరావ్ పట్నాయక్, రాయగడ,ఒడిశా రాష్ట్రం, ఫోను 9437747960

  Go to comment
  2019/08/19 at 10:56 am
 • From యామినీ దేవి కోడే on పాదచారి-3

  నిన్నంటే నిన్ను కాదు.. నాలో దాచుకున్న నన్ను.

  నీ నీడలో నేనున్నా.. నన్ను ప్రేమించవూ అని.. మనసుతో అడిగితే.. పులకించిన ప్రకృతి గలగలమని ఆకుల చప్పుడుతో ఊసుల బాసలు చేసాయి.

  ఆశల స్కూటరు నడిపే స్వప్న మూర్తిలో ఆశల సౌధం కట్టుకుని ఊహల మేడలో ఆమెకై పడే ఆరాటాన్ని చూసాను.
  ఆమెవరో తెలియదు.. కానీ.. ఐక్యం కాలేదని తనలో దిగులు చెట్లు పాతుకుంటాడతను.. మనిషిలోని ఆ స్వప్నికుడు.!

  చేతుల మాల చెట్టు కేస్తే చిటుక్కున కుట్టిన చిట్టి చీమ.. ఎందుక్కుట్టావంటే అప్పుడు కదా చెప్తుంది అసలు నిజం..
  మనసు నుంచీ విడివిడి మనిషివలే మసలి.. ప్రకృతి నుండి విడివడుతున్నావనే ఎరుక చేయడానికే కుట్టానని.

  సమస్త జీవజాలంతో సంచారం
  ఆశ్వాదించే మనసుకు నిదర్శనమై.. చక్కటి అనుభవ సారమనిపించింది.
  ఫలాలేరుకోవడం.. సేదతీరడం.. ప్రకృతిని ఆశ్వాదించడం..
  కుక్కపిల్ల సావాసం..
  అసలు ప్రశ్న.. అవసరమైన ప్రశ్న.. నువ్వు ఎవరూ? నేను ఎవరూ?

  నిద్రలో.. కలలు.. అందులో కథల్లాంటి కలలు.

  నీవనే నీవంటే..??
  తర్కం అనే రెండు వైపులా పదునైన కత్తి. ఆ కత్తి అందులో పదును ధర్శించాక నిజం ఆచూకీ.. సత్యం యొక్క స్థానం రెండు కనిపిస్తాయి.

  కొండ కోనల నుండీ భూమి ఆకాశాలవరకూ.. సముద్రం గర్భం నుండీ ఎత్తైన పర్వత శిఖరాల వరకూ మనిషి ఆశలు, నిశ్వాసలున్నాయి అనే సత్యం ఎరుకలోకి వచ్చాక గుండెల్లో ఆనందం వ్యాకోచించి పెదవులపై చిరునవ్వుగా పరచుకుంది.

  ఆ దృశ్యాదృశ్యాలు..
  ఆ అనుభూతులన్నీ
  మాయేదో నిజమేదో చూడమని చెప్పినట్టనిపించిది.

  నీ కళ్ళకు కనిపించేది దౌర్భాగ్యం
  నా కంటికి రుచించేది సౌందర్యం అన్న
  భావం లో రమించు వాడిని తెచ్చి.. వాస్తవాన్ని రుచి చూపడం బావుంది.

  వంటిని విస్తరి చేసిన పసితనాలెన్నో..
  ఆ తర్వాత చివరి పేరా వరకూ మనసు మెలిక పడింది.
  పలయనానికీ.. విప్లవానికీ మద్య తేడా సున్నితంగా తెలియజెప్పడం ఆలోచనలో పడేయక మానదు.
  పాదచారి వెంట అన్ని పాత్రల్లో.. కలగలిసిపోయాను.
  ఆ అడుగుల్లో అడుగేస్తూ అక్కడే నేనింకిపోయాను.

  Go to comment
  2019/08/19 at 10:05 am
 • From యామినీ దేవి కోడే on పాదచారి-2

  మనిషికీ మనసుకూ మద్య ఊసులు
  పాదచారి వెంట పాత్రలు..
  ఎవరి లోకంలో వారిని ఉండనివ్వక సత్యమేమిటో చూపిస్తాయి.
  నిత్యం వైపు నడిపిస్తాయి.

  కావాలనుకున్న కాంతి నక్షత్రం
  దూరపు కొండ.. మనిషికీ మనసుకూ మద్య శ్వాసలూ.. నిట్టూర్పులూ.. ఎన్ననీ.. చెప్పలేనన్ని శ్వాసలు ఎదురుగా నిలిచి నిలతీస్తున్నాయి.

  రేయి.. పగలు చీకటి.. వెలుగు ఇలా అనేకం వెలిగి ఆరే నక్షత్రాలు.. ఎంత చక్కటి పోలికలివ్వన్నీ.. జీవితం క్షణకాలపు బంగురం అనే మాట ఎందుకో నా కిప్పుడు గుర్తు వచ్చింది..

  ఈ ప్రస్తావన ఇప్పుడు సరైనదో కాదో కానీ.. నాకు అదే అనిపించిది.
  ఏదో ఉందనుకోవడం.. కావాలనుకోవడం..
  ఊహలో ఉన్నదీ.. కావాలనుకున్నదీ..
  అప్పుడే తెలిసింది తృప్తి అనేది ఉండేది ఎక్కడని.

  పాదచారి పార్కులో ప్రేమికుణ్ణి అడిగే ప్రశ్న ఆలోచన రేకెత్తించదూ..
  నక్షత్రాలను అడిగే ప్రశ్నలు కూడా అంతే ఆలోచనలో పడేసాయి.
  ఈ ఆరోమెట్టు కథే నాక్కావాల్సిందనిపించిందిప్పుడు.. చేరవలసిన తీరమేదో అక్కడే ఉన్నట్టుంది..

  Go to comment
  2019/08/18 at 10:40 pm
 • From prabhakaramsivvam on మానస సంచరరే-22: అన్నా 'అను'బంధం.. అనురాగ గంధం!

  శ్యామలగారి వ్యాసం” అన్నా అనుబంధం అనురాగగంధం ”
  బాగుంది. అన్నా చెల్లెల అనుబంధాన్ని ఇతిహాసాల గాథలు, మధురానుభూతిని కలిగించిన సినీ గీతాల పరిచయాలతో
  శ్యామలగారు చక్కగా వర్ణించారు. రాఖీ అనగానే ఏదో తెలియని అనుభూతి, అన్నా చెల్లెల ప్రేమ, అనుబంధాన్ని అన్న కుడిచేతి మణికట్టున ఆ రాఖీతో దాచిపెట్టుకుంటుంది.
  అదీ అన్నా చెల్లెల అనుబంధం. ఈ వ్యాసం చదువుతున్నంత
  సేపూ ఏదో తెలియని అనుభూతి శ్యామలగారు కలిగించారు
  శ్యామలగారికి అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Go to comment
  2019/08/18 at 7:07 pm
 • From కస్తూరి మురళీ కృష్ణ on పాదచారి-3

  This is the comment by Sivangi
  Verasi- Nee Padachari 3 Bhagalpur chadivanu.

  Nee Viplavam, Nee Karunyam, Nee Prema, Nee Prakruthi, Nee Asa Bhavam, Nee Picchitana I meant I read all 3 parts – parichina Hrudayam- Pagilina Addam lanti vastava Karaku samaajam- entho Bhavavesam- nijanni Pacchiga chupe tapana- very deliberate n sincere effort. Has to touch the heart of the reader!!
  Jali manasutho Chinna cheemaki kuda apakaram cheyyani parama Nazukaina hrudayamSamudranni saitham tagesentha UdrekamEmi cheyaleni Nee Nissahayam You have very artistic hands – anduke Kadhani andamaina Silpam laaga chekkagalav.Entho cheyyalanna Kondantha TapanaYeah nuvvo errabassu Akasanni mingesentha Avesa Samudranni saitham tagesentha Udrekam.. How old were you when you started this??
  Ammavari karuNa
  Verribaguloda!!
  Nimpesindi neelo
  It’s not possible for everyone to relate to Nature. Yes. You r right Mother Nature

  Go to comment
  2019/08/18 at 2:45 pm
 • From సూర్యనారాయణ మూర్తి on సంస్కృత శ్లోకాలు - తెలుగు పద్యాలు 23

  చాల బాగున్నాయి

  Go to comment
  2019/08/18 at 12:56 pm
 • From Padma on పాదచారి-3

  పాదచారి మొదటివారాన్ని మామోలుగా ,రెండవవారాన్ని ఉత్సుకత తో ,మూడో వారాన్ని మనస్సు నింపుకొని‌చదివిన తరువాత తెల్సింది .భావోద్వేగాల శకలాలు లోంచి ఎవరికి వారు లోలోపలకు చూసుకొంటే ,ఒకో శకలం లోనుంచి ,ఒక కల నో ,ఒక‌విప్లవ మూర్తో ,ఒక‌ వేదాంతో కన్పించినట్లుగా ఎవరికి వారు ప్రశ్నించుకొన్నట్లుగా అద్భుతమైన రచన లా కొనసాగుతుంది .భువనచంద్ర సార్ కి నా హృదయపూర్వక నమస్సులు .ఇంత చక్కటి రచనను అందిస్తున్నా సంచిక పత్రిక వారికి హృదయపూర్వక అభినందనలు

  Go to comment
  2019/08/18 at 12:36 pm
 • From విరించి on మానస సంచరరే-22: అన్నా 'అను'బంధం.. అనురాగ గంధం!

  అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని ఆపాతమధురాలైన చలనచిత్రగీతాలను సందర్భోచితంగాగుర్తుచేస్తూ చక్కనివ్యాసాన్ని అందించారు..శ్యామలగారి మరిన్ని వ్యాసాలు,కథలు రావాలనికోరుతు అభినందనలు..

  Go to comment
  2019/08/18 at 8:52 am
 • From Guruprasad on మానస సంచరరే-22: అన్నా 'అను'బంధం.. అనురాగ గంధం!

  Excellent narration by smt shyamala gaaru regarding brother sister relationship
  J Guru Prasad

  Go to comment
  2019/08/18 at 7:43 am
 • From M K Sarma on కాజాల్లాంటి బాజాలు-31: ఎవరైనా వున్నారా!

  అత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లుంది. ప్రయత్నిస్తే
  పోయేదేముంది మేడం. వస్తే సినిమా ఛాన్స్, లేకపోతే అనుభవం లో సినీజనుల తత్త్వం బోధపడుతుంది.

  Go to comment
  2019/08/17 at 5:40 pm
 • From Konduri Kasivisveswara Rao on నటుడు

  Familyne neglect chesi kala seva cheyatam pechhitanam
  mariru verrithanam ani Natudu
  kadha dwara theliyachesaru writer G.Narasimha Murthy garu. Samajaaniki elaanti kanuveppu kalginche kadhalu chaala avasaram.
  Konduri Kasivisveswara Rao, writer

  Go to comment
  2019/08/17 at 3:50 pm
 • From C.Yamuna on లక్ష్యం

  Thanks , Rami Reddy gaaru !

  Go to comment
  2019/08/16 at 9:41 pm
 • From MV Ramireddy on లక్ష్యం

  Nice story. Congratulations Yamuna garu

  Go to comment
  2019/08/16 at 1:53 pm
 • From Peyyeti Ranga Rao on లక్ష్యం

  చాలా కథలు బహుమతి వచ్చినవి చదువుతూ వుంటాను. నిరాశగా వుంటుంది. విదేశాలలో సెటిల్ అయి కోట్లు కోట్ల ఆస్తి విదేశాలలోను, భారతదేశంలోను కూడా సంపాదించిన జంట కేవలం తమ పిల్లలు తప్పుదారిలో పడ్డారన్న మనోవ్యథతో భారతదేశం వచ్చి ఒకరినొకరు కవుగలించుకుని ఉరేసుకున్నారట. ఆ కథకు బహుమతి వచ్చింది. రచయిత ఏం చెప్పదలుచుకున్నారు? ఆ దంపతుల సమస్యకు ఆత్మహత్య పరిష్కారమా? సమాజానికి ఆయన ఇచ్చే సందేశం అదేనా? ఆ రచయితతో మీ కథ బాగాలేదు అని చెప్పిన పాపానికి మీ లాంటి వాళ్ళకు నా కథ అర్థం కాదులెండి అని సమాధానమిచ్చారు.
  సి.యమున గారి కథ లక్ష్యం చదివాను. A story written with positive attitude. There is a good message in it. This story definitely deserves a prize. Congratulations to the writer.

  రచయితకు సామాజిక బాధ్యత వుంటుంది. ఈ విషయం గుర్తెరిగి రచనలు చేయవలసి వుంటుంది. ఇది రచయితలు, సంపాదకులు కూడా గుర్తుంచుకోవడం అవసరం.

  Go to comment
  2019/08/15 at 6:05 pm
  • From C.Yamuna on లక్ష్యం

   ధన్యవాదాలు గాయత్రి గారు

   Go to comment
   2019/08/16 at 9:24 pm
 • From Subramanyam Valluri on సాధకుడు - సాధన - సాధనాచతుష్టయము

  చాలా బాగా రాసారు. ఇంకోసారి చదవాలి. సుబ్రహ్మణ్యం వల్లూరి

  Go to comment
  2019/08/14 at 8:42 am
 • From Deepa on మానస సంచరరే-21: జీవితం.. ఓ స్నేహగీతం!

  Another enjoyable and self-searching read! Kudos to the author!!

  Go to comment
  2019/08/13 at 3:39 am
 • From Kasturi muralikrishna on పాదచారి-2

  ఇది Dr గాలి రాజేశ్వరి గారి అబ్జిప్రాయం
  మరుపు మనిషికి కొండొకచో వరం! కొండొకచో శాపం!…”మరుపు,ఙాపకం” రెండూ మనిషికే సొంతం….నన్ను నేను మరిచిపోతే నీదగ్గరకెలా రాగలను దేముడా!?….నన్ను నేను మరిచిపోతే,అస్తిత్వాన్ని కోల్పోతే నిన్నెలా చూడను ప్రేమా!?…సరే..సరే..నన్ను నేను మరిచిపోతా! ఆలోచనలను,అహాలనూ వదిలేస్తా!…ఓ ప్రకృతీ.. నాప్రకృతిని వదిలేస్తే దర్శనమిస్తానంటావు!!…ఆఁహాఁ ఓహో..ఇన్నింటిని వదలగలిగితే ఇంక దేముడెందుకు?ప్రేమా, ప్రకృతీ ఎందుకటా!?………….ఔను స్నేహపరిష్వంగంలోనే సర్వాన్నీ మరిచిపోగలం…నన్ను నేను అలాగే మరిచిపోయా! మరి నాస్థానంలో నీ తిష్టేంటట?? మోసం..దగా.. అన్యాయం….ఏవండోయ్ చదువరులారా, పాఠకులారా, ”ఆపంక్తులు” జాగ్రత్తగా మనలను తమతో నడిపించవు…తమలో కలిపేసుకుంటాయి…జాగ్రత్త పడండి.అనుభవంతో చెబుతున్నా….

  Go to comment
  2019/08/12 at 6:37 pm
 • From Kasturi muralikrishna on పాదచారి-2

  this is the opinion of dr. Gali Rajeswara rao.
  షరతులు లేని నిబద్ధత పాదచారిది. ధృడమైన మనో వైరాగ్యం పాదచారిది.. కలియుగం లో నవజీవన పథంలో జీవించడం గొప్ప కళ ..ఆ జీవనకళ పాదచారి సొంతం.. అశాశ్వతాలకోసం, వగపు కూడదంటాడు..మనసుతోనే వుంటూ మనసుకేదీ అంటించుకోకుండ కర్మలకతీతంగా వుండగలిగే గంభీరమైన నివృత్తి పథం పాదచారిది….
  క్షణం క్షణం కరిగిపోతోంది..కణం కణం కాలిపోతోంది…తానా పాదచారి పాదాలు ఆగలేదు……గరిక కూడా హీరోనే! గరికవీరుడంటే గ్రీకు వీరుడే..మరి!..గడ్డిపూవుకూ వుందొక అస్తిత్వం!…అవన్నీ మీ ఆహ్వానాన్ని విని నవ్వుకున్నాయా!? పరిహసించాయా!?….పాపం పాదచారి!అలుపెరగని బాటసారి…(పాటసారి కూడా) నాకెందుకో మయసభ, దుర్యోధనుడు గుర్తొచ్చారు………నిజమే మనిషికి భయపడనిదెవరు?అన్ని ప్రాణులకూ వాడే యముడు..జంతువులకు వేట అవసరార్థం…మనిషికి వేట వినోదార్థం…అదీ దొంగచాటు వేట…చివరాఖరికి కప్పకు కూడ కరుణ లేకపోయింది..మనిషి తప్ప అన్నీ నిష్కామంగానే వున్నాయి వుంటాయి..
  మనిషి దేవునిమాటా వినడు. ప్రకృతి మాటను అస్సలు పట్టించుకోడు..సాహిత్య వచనాన్ని ఏమాత్రం లెక్క పెట్టడు…….కాగా…మమ్మల్ని మేము మరిచిపోతే మీపుస్తకమెందుకు?..సరే..సరే..పుస్తకాన్ని పట్టుకున్నాక ఇంకో లోకమెందుకు? అదంటూ వుంటేకదా…నేనే లోకం..లోకమే నేనైపోతే!?….ఇక, ”నీలోని నీ లోకం లోకి”…అని అంటారు గానీ…అది ”నీ” ”నా” లు లేనిలోకం కదా…ఇప్పటిదాకా కచ్చితంగా నాకు తెలియని లోకమది.

  Go to comment
  2019/08/12 at 10:30 am
 • From Syamala Dasika on మానస సంచరరే-21: జీవితం.. ఓ స్నేహగీతం!

  శ్యామల “జీవితం ఓ స్నేహ గీతం” చదువుతుంటే మా నలభై ఎనిమిది సంవత్సరాల మధురమైన స్నేహ గీతం నా మనసులో వినిపించింది!
  పల్లెటూరి అమ్మాయినైనా నాతో స్నేహం కట్టి , ఎన్నో సార్లు చదువులో సహాయం చేసి మా ఊరిని మా ఇంటిని మిస్ అవుతున్న నన్ను ఓదార్చిన స్నేహ శీలి శ్యామల!
  రచయిత్రి చెప్పినట్టు స్నేహానికి కావలసిన సమభావన మాలో ఉండటం వల్ల కాబోలు మా స్నేహం అంత గట్టిగా ఉంది. మా ఇద్దరి పేర్లు ఒకటే అవడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది!
  అన్ని విషయాల పట్ల చక్కని అవగాహన కలిగి ఉన్నతమైన రచనలను అందించే జె. శ్యామల నా స్నేహితురాలైనందుకు గర్వపడుతున్నాను!!
  శ్యామలాదేవి దశిక
  న్యూ జెర్సీ – యు ఎస్ ఎ

  Go to comment
  2019/08/11 at 12:14 pm
 • From పి.కాశీవిశ్వనాధం on నీలమత పురాణం - 35

  విలువైన సమాచారాన్ని అందించారు..ఇలా ప్రతీ ఒక్కరూ ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి లేకుంటే రాజకీయ లబ్దికోసం మనల్ని వేరు చేశారు.వారికి లేని అధికారాలను కట్టబెట్టారు…ఇన్నాళ్ళకైనా మనకి మంచి జరిగింది…మంచి వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు..లింక్ అందరికి షేర్ చేస్తాను.

  Go to comment
  2019/08/11 at 7:12 am
1 2 3 49

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!