ఏమో.. ఏమయిందోనా హృదయమెందుకో స్పందించట్లేదు
చితికిన బాల్యంచిందరవందర యౌవనపు గురుతులురాచపుండల్లే రక్తమోడుతున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
కలలుగన్న ప్రపంచంకసిదీరా కాటువేసికన్నీటిధారల కానుకిస్తున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
అనురాగమనుకున్నఅహంకారపు కోరల అణగారినఆశలు అరిచి అరిచి అలిసిపోతున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
బంధాలే బంధనాలై బిగిసిఊపిరాడక గింజుకుంటున్నతన ఉనికి తన ఉసురు తీస్తున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
వింత పోకడల సమాజపువికృత చేష్టలకు విస్తుపోయిగొంతెత్తి వివరమడగాలని గోల చేస్తున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
విలువల వలువలు వదిలినలోకుల నలుపు తెలుపులనగ్నత్వం హుంకరించి హేళనగ నవ్వుతున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
మృగవాంఛల బలయినబ్రతుకు మూల్యం మూలకుచేరిందిదేమని మాటకు మాట ప్రశ్నించమంటున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
జీవనపోరాటంలో సమిధలైనసుదతుల బానిసత్వపుసంకెళ్ళ ఒరిపిడుల మంటలు మండుతున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
పరధర్మమును మెచ్చినకలి ధర్మం తప్పొప్పుల మాట మరచినిస్సిగ్గుగా కన్నుగీటి కవ్విస్తుంటేనా హృదయమెందుకో స్పందించట్లేదు
ఆహ్లాదమిచ్చే ప్రకృతిఆగ్రహించి ఆయువు తీస్తుంటేమానవ తప్పిదముల మన్నింపులడగమని మొత్తుకుంటున్నానా హృదయమెందుకో స్పందించట్లేదు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™