ఒక సాహిత్యకారుడు లేదా ఒక సాహిత్యాభిమాని లేదా సాహిత్యపిపాసి తనకంటూ ఒక ఇమేజిని పెంచుకుని దానిని మరింత విస్తృతం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు గానీ, తన వెనుక కదలి వచ్చే తరానికి తనదైన శైలిలో దిశానిర్దేశం చేయగల విశాల హృదయం గల సాహిత్యకారులు బహు తక్కువగా కనిపిస్తారు. ఎప్పటికీ తమ గురించే డప్పుకొట్టుకునే సాహితీ పెద్దలు, స్వార్థపరులై, తమను మించిపోతారనే భ్రమతో కనీసం కొంచెం కూడా ప్రోత్సహించడానికి ముందుకు రారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. చేయి తిరిగిన సాహిత్యకారులు (ఏ ప్రక్రియలోనైనా సరే) ప్రతి చిన్న పోటీలోనూ తమ అస్తిత్వం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. పత్రికలు కూడా అలాంటివారినే ప్రోత్సహిస్తాయి. మరి తరువాతి తరానికి ప్రోత్సాహం ఎక్కడినుండి వస్తుంది? ప్రతి పోటీలోనూ వారే బహుమతులు గెలుచుకుంటారు. ఒక స్థాయికి వచ్చిన తరువాత, చేయి తిరిగిన రచయితలు లేదా కవులు ఇలాంటి పోటీలకు దూరంగా ఉండాలి. అంటే వారి సాహిత్య కృషిని తక్కువ చేయడం కాదు. ఒక స్థాయికి వచ్చాక, పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాక, యువతను ప్రోత్సహించడానికి కృషి చేయాలి. కానీ ఈ ప్రోత్సాహం సాహిత్యరంగంలో ఇప్పుడైతే ఎక్కడా కనిపించడం లేదు. కొద్దిమంది ఎవరూ చెప్పకుండానే, ప్రోత్సహించడం అనే పద్దతికి కట్టుబడి వుంటున్నారు. వారు నిజంగా అభినందనీయులే!అయితే అలాంటి వారు బహు తక్కువ. ఈ విషయంలో పత్రికలు కూడా కట్టడి చేయలేవు. ఆయా సాహిత్యకారులకే ఆ జ్ఞానం ఉండాలి. నాకు అతి దగ్గరి రచయిత, ఎన్నో మంచి కథలు, నవలలు రాసిన, అనువాదాలు చేసిన రచయిత పదవీ విరమణ చేసిన తర్వాత, తన రచనా వ్యాసంగాన్ని తగ్గించినప్పుడు అది గమనించిన నేను ఆయన్ను నేను అడగడం జరిగింది ఇలా –
“మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ విశ్రాంతి సమయంలో మీ రచనా వ్యాసంగ సమయం పెరుగుతుందని భావించాను, కానీ మీరు తగ్గిస్తున్నారేమిటి?” అన్నాను. దానికి ఆయన సమాధానం నన్ను ఆశ్చర్య పరిచింది.
“ఇప్పటి యువత మంచి రచనలు చేస్తున్నారు, ఇక నేను రాయడం భావ్యం కాదేమో!” అన్నారు.
ఆయన వ్యాఖ్యానం నూటికి నూరుపాళ్లు సరి అయినది కాకపోయినా, యువతను దృష్టిలో ఉంచుకుని, ఆయన చేసిన వ్యాఖ్యానం స్వాగతించ దగ్గదేనేమో! ఎంతమంది వుంటారు అలా? అలా వున్నవారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించ వలసిందే..! తన తర్వాతి తరాన్ని ప్రోత్సహించేవారిని గొప్ప సాహిత్యకారులుగా ప్రశంసించ వలసిందే! అలాంటి పెద్దల రచనలు యువరచయితలకు మార్గదర్శనం చేసేట్టుగా ఉండాలి తప్ప, వారి భవితను అడ్డుకునేవిగా వుండకూడదు. చేయి తిరిగిన రచయిత లేదా పేరు ప్రఖ్యాతులు వున్న రచయిత తన ప్రక్రియలో, అంటే ఉదాహరణకు కథా రచయిత, కథకులను, కవి, కవులను, నవలాకారుడు -నవల రచయితలను తన వంతుగా ఎంతమందిని తయారుచేయగలిగాం అని ఎవరికీ వారు ప్రశ్నించుకోవాలి.
నేనొక పెద్ద కథా రచయితను కాక పోవచ్చు, గొప్ప చేయి తిరిగిన కవిని కాక పోవచ్చును, అలాగే వ్యాసకర్తను కాక పోవచ్చు, కానీ.. నా స్థాయిలో నేను ఎంతోమంది రచయితలను, కవులను, వ్యాసకర్తలను తయారు చేసాను. వాళ్ళు నన్ను మించిన ప్రయోజకులైనారు. అది నాకు గర్వకారణమే! ఏ యోగ్యతా లేకున్నా వాళ్ళు నన్ను ‘గురువు గారూ..’ అని పిలుస్తుంటే చెప్పలేనంత ఆనందం! ఇలా చెబుతుంటే, నన్ను నేను పొగడుకుంటున్నాననే అపవాదు రావచ్చు. అందుకే నా గురించి నేను చెప్పడం కాస్త తగ్గించి, నా ప్రోత్సాహంతో అతి తక్కువ సమయంలో రచయితలుగా ఎదిగి పేరు తెచ్చుకున్నవారి గురించి ప్రస్తావిస్తాను. ఎందుచేతనంటే నా కళ్ల ముందు వారి ఎదుగుదల నాకు కాక ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుంది?
నేను ఉద్యోగం చేస్తున్న కాలంలోనే, వరంగల్ ఆయర్వేద కళాశాలలో పి.జి. చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మిత్రుడు ఒకాయన ఉండేవాడు. డెంటల్ పేషేంట్‌గా ఆయన నాకు పరిచయం అయ్యాడు. మంచి వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నవాడు. సంస్కృతం చదువుకున్నవాడు, మంచి ప్రతిభావంతుడైన ఆయర్వేద వైద్యుడు. మా డెంటల్ వైద్యం విషయంలో, మా ఇద్దరికీ సరిపడేది కాదు. వారి వైద్య విభాగంలో చికిత్సా విధానాలకూ, మాకూ చాలా తేడా ఉండేది. ఎప్పుడూ ఏదో అంశం మీద చర్చ లేవదీసి నన్ను విపరీతంగా విసిగించి నా చేత తిట్లు తినేవాడు. అది ఆయన సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. పైగా ఆనందించేవాడు. నామీద ఆయనకున్న అభిమానమూ, గౌరవమే దీనికి ప్రధాన కారణం. స్నేహం పెరిగిన తర్వాత నన్ను ‘గురువు గారూ’ అని పిలిచేవాడు. క్లినిక్‌కు వచ్చినప్పుడల్లా తినడానికి ఏదో ఒకటి తెచ్చేవాడు. ఇలా మా స్నేహం బాగా పెరిగింది.
అప్పట్లో పత్రికల్లో నా వ్యాసాలు వస్తుండేవి. అవి నా వృత్తికి సంబందించిన దంత వైద్యానికి సంబందించిన వ్యాసాలు. అవి ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. ఆయనకు కూడా ఆయుర్వేదంలో వ్యాసాలు రాయాలనే కోరిక పుట్టింది. అదే విషయం నాతో ఒకరోజు చెప్పాడు. తప్పక రాయమన్నాను. నా సహకారం కావాలన్నాడు. సరేనన్నాను. ఒక సాయంత్రం తాను రాసిన వ్యాసం తీసుకుని నా క్లినిక్‌కి వచ్చాడు. ఆయనే డాక్టర్ కృష్ణమాచారి. ఆయుర్వేదంలో మంచి వైద్యుడు, మంచి ఉపాధ్యాయుడు కూడా! సంస్కృతంలో కూడా ఆయనకు మంచి పట్టు వుంది. అది నిరూపించడానికా.. అన్నట్టు, ఆయన తెచ్చిన వ్యాసం నిండా సంస్కృత శ్లోకాలు వున్నాయి. మామూలు చదువరికి అర్థం అయ్యే పరిస్థితి అసలు లేదు. పి.జి. విద్యార్థుల కోసం నోట్స్ రాసినట్టు వుంది. దానినే మళ్ళీ ఒక సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా రాసుకు రమ్మన్నాను. ఒక మామూలు విద్యార్థిలా చెప్పినట్టు చేసేవాడు. అరడజను సార్లు తిరగ రాసిన తర్వాత ఆతను ఒక మంచి వ్యాసం రాయగలిగాడు. నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అతని పట్టుదలకు నేను చాలా గర్వపడ్డాను. ఆ తర్వాత ఆయన చాలా వ్యాసాలు రాసాడు. ఎక్కువగా.. ఆదివారం విశాలాంధ్రలో ఆయన వ్యాసాలు వస్తుండేవి. ఒక మంచి వైద్య విజ్ఞాన రచయితను తయారు చేయగలిగానన్న తృప్తి నాకు బాగా ఉండేది.
నాకు ఇష్టం లేకున్నా నన్ను ‘గురువు గారూ’ అని పిలవడానికి ఇష్టపడుతుండేవాడు. కానీ.. మా మైత్రి ఎక్కువకాలం నిలవలేదు! ఎవరూ ఊహించని వ్యాధి సోకి ఆయన స్వర్గస్థుడైనాడు. గుర్తుకు వస్తే ఇప్పటికీ అతని మరణం నాకు చాలా బాధ కలిగిస్తుంది.
సుమారు పాతికేళ్ల తర్వాత మా స్నేహాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని, సహృదయ మిత్రులు శ్రీ తోట సాంబశివరావు గారు నాకు కలగజేశారు. నేను మహబూబాబాద్‌లో దంత వైద్యుడిగా పని చేస్తున్న కాలంలో ఆయన అక్కడ ఆంధ్రా బ్యాంకు (ఇప్పటి యూనియన్ బ్యాంకు) మేనేజరుగా పనిచేసేవారు. అలా మేము స్నేహితులమై, బదిలీ కారణంగా 1994లో మేము విడిపోయాము. మళ్ళీ ఒకసారి కరీంనగర్లో కలిసే అవకాశం కలిగింది. తర్వాత నా గురించి ఆయనకు, ఆయన గురించి నాకు, ఎవరు ఎక్కడ ఉన్నారన్నది తెలీదు. తర్వాత అనుకోని రీతిలో మా అబ్బాయి పెళ్లి కార్డు మమ్మల్ని తిరిగి కలిపింది. చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ మేము కలుసుకునే సమయానికి, నేను రచయితగా కాస్త నిలదొక్కుకుని, మూడు కథా సంపుటాలు వేసి వున్నాను. సాంబశివరావు గారు నటులు – నాటక ప్రియులు. అయితే కథా రచయితగా పత్రికల్లో తన పేరు చూసుకోవాలనే విపరీతమైన కోరికను ఆయన వెలిబుచ్చారు. అన్నదే తడవుగా, ఆయన విజృంభించారనే చెప్పాలి. ఆయన కథ రాసి మొబైల్లో నాకు వినిపిస్తుండేవారు. అప్పటికే ఒక నవల వ్రాత ప్రతి ఆయన దగ్గర వుంది. ఆయన వినిపించిన కథలకు నాకు తోచిన మార్పులు చెబుతుండేవాడిని. ఒక మంచి మనసుతో ఆయన ఆ మార్పులు అంగీకరించేవారు. అంతమాత్రమే కాదు తక్షణమే కథను తిరగ రాసి మళ్ళీ నాకు వినిపించేవారు. అలా కథా రచయితగా ఆయన ఆరంగేట్రం చేశారు. పత్రికలకంటే ముందు ఆయనను రేడియోకు (ఆకాశవాణి -హైదరాబాద్) పరిచయం చేసాను. అప్పటి శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి ఆధ్వర్యంలో రేడియోలో పలుమార్లు ఆయన కథలు చదివారు. తర్వాత శ్రీ సి. రాంబాబు గారి ద్వారా, శ్రీ నక్కా సుధాకర్ గారిని పరిచయం చేసుకుని రెండు రేడియో నాటికలు ఆయన ఆధ్వర్యంలో ప్రసారం అయ్యే అదృష్టం శ్రీ సాంబశివరావు గారికి కలిగింది.
తర్వాత ‘సంచిక’ అంతర్జాల పత్రికకు కథలు, నాటికలు రాస్తున్నారు. ‘సహరి’ అంతర్జాల పత్రికకు కూడా ఆయన కథలు రాస్తున్నారు. వృత్తిపరంగా ఆయన ఎదుర్కొన్న అనుభవాలను నలుగురికీ పంచే ఉద్దేశంతో త్వరలోనే ‘సంచిక’ పత్రికలో ఆయన ధారావాహిక రాయబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఈ రచనా వ్యాసంగం మూలంగా అనేకమంది సాహితీ మిత్రులకు ఆయన దగ్గర అయ్యారు. పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవలసిన వ్యక్తి, ఇప్పుడు పూర్తిగా తన సమయాన్ని సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలకు వెచ్చించగలగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతి కొద్ది కాలంలోనే మంచి కథా రచయితగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ఆయన పట్టుదలకు తార్కాణం. ఇలాంటి పట్టుదల వల్లనే సాంబశివరావు గారు బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాలను అధిష్టించ గలిగారని నాకు అనిపిస్తుంటుంది. అంతటి వ్యక్తి నన్ను గురువుగారూ అని పిలుస్తుంటే, చెప్పొద్దూ.. నాకు సిగ్గుగానే ఉంటుంది. ఆయన అభిమానానికి చేతులెత్తి నమస్కరించవలసిందే! సాంబశివరావు గారు మరిన్ని రచనలు చేయగలరన్న నమ్మకం నాకుంది. నిజంగా ఆయన ఏకలవ్యుడే!
శిష్యరికానికి నిలువెత్తు సంతకం మా సాగర్ రెడ్డి. పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. నెల్లూరు వాస్తవ్యుడు, ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. ‘అపురూప జ్ఞాపకాలు’ సమూహంలో పరిచయం అయ్యాడు సాగర్ రెడ్డి. సాహిత్యం పట్ల అభిరుచి వున్నవాళ్లను ప్రోత్సహించడం నాకు మొదటి నుండీ వున్న జబ్బు కదా! అలా నా వలలో పడ్డ సాహిత్య పిపాసి సాగర్ రెడ్డి. తెలీని విషయం తెలుసుకోవడంలోనూ, మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవడంలోను సాగర్ రెడ్డి తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటున్న వర్ధమాన కవి. అతనిలో కవి అంతర్గతంగా వున్నాడు. కాస్త చేయి అందించగానే అతని విశ్వరూపం కవిత్వంలో చూపిస్తున్నాడు. గురువును మించిన శిష్యుడిగా ఎప్పుడో నేను అతనిని గుర్తించాను. ఎన్నో సమూహాలలో సాగర్ ఇప్పుడు సభ్యుడు. అందరికంటే ముందు తన కవిత సమూహంలో ఉండాలనుకునే క్రమశిక్షణ గల యువ కవి సాగర్ రెడ్డి. తన కవిత్వం ద్వారా, ఇతరుల కవిత్వం మీద తన అభిప్రాయాలు రాయడం ద్వారా సాగర్ రెడ్డి ఎంతోమంది సాహితీ మిత్రులను తన ఖాతా జమ చేసుకున్నాడు.
అతికొద్ది కాలంలోనే రెండువందలకు పైగా కవితలను ‘ప్రతి లిపి’లో జమ చేసిన రికార్డు సాగర్‌ది. ఈ మధ్యనే ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ గారు ప్రధాన అడ్మిన్‌గా నడుస్తున్న ‘ప్రియమైన రచయితలు’ గ్రూప్‌లో సాగర్‌ను చేర్చడం జరిగింది. అందులో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద సాగర్ కవిత్వం రాస్తున్నాడు. ‘నానీలు’ ప్రక్రియలో తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. ఈ మధ్య అంతర్జాల పత్రికా రంగంలో కూడా అడుగుపెట్టాడు. అతని ఉత్సాహం, పట్టుదల, నిజంగా ప్రశంసనీయం. తెలుగు సాహితీ క్షేత్రంలో మరో ఆణిముత్యం మనకు అందబోతుందన్న నమ్మకం నాకు వుంది. నా నమ్మకాన్ని వమ్ము చేయడనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. సాగర్ రెడ్డికి నిండు మనసుతో నా అభినందనలు.
నేను ఎక్కువగా కవిత్వం రాయకపోయినా, నా రచనల్లో ఎక్కువ కవిత్వం లేకున్నా, నా ప్రేరణతో నన్ను మించి రాస్తున్న ఎవరినైనా నేను ఇష్టపడతాను. జీవితంలో నాకు మిగిలిన ఈ తృప్తి చాలు. నా ఆరోగ్యానికి, నా ఉత్సాహానికి, రచనా వ్యాసంగానికీ ఇదే ఇంధనం, ఇదే నన్ను నిత్యం ప్రేరేపించే అత్యుత్తమ కేటలిస్టు! ఈ స్నేహ పరిమళం ఇలాగే కొనసాగాలన్నది నా కోరిక.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సర్ ప్రతివారం ఎదురుచూసే మీ ఙ్ఞాపకాల పందిరి ఒక అనుభవం అయితే ఈ రోజు అందుకున్న మీ రచన నా జీవితానికే ఒక ప్రత్యేకం. నేను గురువు గారిగ మిమ్మల్ని అభిమానించడం కాదు. అసలు కవితకు శీర్షిక ఉండాలనే విషయం కూడ తెలియని స్ధితీనుంచి ఇన్ని కవితలు అంశాలమీద చర్చకు ఉసిగొల్పేలా నన్ను మీరు ప్రోత్సాహించడం అనేది గురువు అనే పదం కంటే ఎక్కువ. ఇక మీ ద్వారా పరిచయం అయ్యి నన్ను తమ్ముడూ అని ఆప్యాయంగ పిలిఛే సాంబశివరావు లాంటి వారి సాంగత్యం నాకు అదృష్టంతో కూడినది. ఇక మీ రచనలో మీరు చెప్పినట్లుగా ప్రోత్సాహం అనేది మికున్న ప్రత్యేక ఆభరణం. అది ఎంతోమంది ఒౌత్సాహికులకు మీరు ఇచ్చే ఎనలేని కానుక. నాకు తెలిసి ప్రస్తుత కాలంలో మీలాంటి వ్యక్తులు అరుదు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ మరో సారి ధన్యవాదములుసర్ .
సాగర్, నీ అభిమానానికీ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదములు
ఇది మీ జీవితాల్లో కలిసిన వ్యక్తుల గురించి ఇచ్చిన introduction. ఎందరో మహానుభావు లు అందరికీ వందనాలు.
మిత్రమా.. నీ స్పందనకు ధన్య వాదాలు.
మీ స్నేహశీలత, సహృదయ ఆవిష్కరణ ఈ వ్యాసం. మీరిచ్చిన ప్రోత్సాహం చాలు మీ గురుత్వానికి. ఒక మంచి మాట చెప్పిన ప్రతి వ్యక్తి గురువే నా దృష్టిలో.
సరసి గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.
Good morning sir, I personally experienced that how you extract the inbuilt qualities of your near and dear & you make sure that your support will always be there in the betterment in that regard too. Hearty congratulations to shri.Thota.Sambashivarao garu and Shri.Ch.Vidya Sagar reddy garu and I wish you achieve more and more in the field of Literature. Thank you.
Amma Thank you somuch For your response.
Good morning Sir 🌻.🙏.
Your Jnapakaala pandiri woke me up this Sunday morning.
Your assessment of the well known is a hard REALITY! None denies.This is a very dominant and visible feature applicable to all professionals irrespective of their domain. The more one is popular, the more one becomes selfish to keep oneself self centric to shield one’s primacy!This ,as you rightly pointed, is unexpected of great people!!!We expect…though not found… ideals and public spirited values from the eminenti😭. We are under the impression that they are above the ordinary people😢!!! No doubt, this is the ideal view….as mythologies/great lives reinforced the impression that the Greats are /were blessed with extraordinary /multifaceted humane and semi Divine qualities!!! Rare, rarer and the rarest and sometimes rarer than the rarest…. but historical💪🙏.
This is how most of the popular personalities are popular only during their life time for their works and not remembered as models…. most of the time their narrow views would leave lasting impressions belittling their contributions after their departure.
When the world is governed by, controlled by,dominated by the all -encompassing commercial interests……the results are ,in our parlance Kalikaalic…
The fake fictitious and scandalous Fourth Estate which arrogates to itself without any basis some mythologies is the most (un) popular business house.! 😭
However, as you rightly illustrated,there are oases in our INHUMAN and materialistic social order… which stand out as catalytic agents of optimism and utopia….
Your support, encouragement, mentorship, tutorial, and teacherly role in nurturing new talent is commendable… since, you appreciate the talent ,where as, the majority are immedicably JEALOUS.!!
Krishnama chary ,Sagar reddie and Thota are the fruits of your gracious nurturing.🙏
It appears for any layman that you are different in thinking and matching it with working in perfect unity…Chitthe, Vaachi Kriyayaam…. Ekaroopathah…🙏🙏🙏
——-Sri Nakka Sudhakar. All India Radio Hyderabad.
Sudhakar hi Thank you somuch for your response.
శుభోదయం 🙏
మీరు వ్రాసిన జ్ఞాపకాల పందిరి ఆసాంతం చదివాను.
రచనా వ్యాసంగం అనేది మన మనస్సు పలికే మాటలనే కాదు, ఎదుటి వ్యక్తి మనస్సు విప్పి మాట్లాడే స్వేచ్ఛ ను అందిస్తుంది అనటం ఉత్తమం.
ఒక స్థాయి కి ఎదిగిన వ్యక్తి క్రొత్త నీటికి దారి ఇచ్చి ప్రేక్షకుడి ల ఉండటం ఉత్తమం. కానీ, వాస్తవంగా ప్రస్తుత పరిస్థితులు అనుభవం గల వారి అడుగులను వీక్షిస్తూ తమ అడుగులకు మెరుగులు దిద్దు కావలసిన అవశక్యం కూడా ఉందనేది నా ఉద్దేశ్యం.
ఏ మహా వృక్షం క్రింద కూడా చిన్న మొలక కూడా మొలవదు కానీ అది కొన్ని సందర్భాలకు మాత్రమే సముచితం అనేది నా భావన.
సుదీర్ఘ మైన అనుభవం కలిగిన వ్యక్తుల తో పోటిబడటం అనేది తమను తాము మెరుగులు దిద్దు కోవడానికి ఉపయోగపడే అంశం మాత్రమే, అదే లేక పోతే అపబ్రంశపు, అనానుచిత, అసందర్బపు అక్షర విలక్షణలు కోకొల్లలుగా సాహిత్య దర్శనం చేసుకొని రాబోయే తరాలను ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు..
నిన్నటి అనుభవాల తో కూడిన అద్భుతాలు ఈ నాటి వ్యక్తుల సాహిత్యానికి కొలమానాలు గా బాసిల్లుతే అంతకు మించిన ఆనందం సాహిత్యానికి ఏముంది..
ఇది నా మనస్సులో ని మాట మాత్రమే..
ఎప్పుడు అనుభవం తో కూడిన ప్రయాణం మన దారికి అడ్డు కాదు, అది మనకు మార్గ నిర్దేశం మాత్రమే కాకుండా సువిశాలమైన సౌశీల్య మైన సాహిత్యపు బాటను మనకు ప్రతి క్షణం పరిచయం చేస్తూ మనకు మార్గ నిర్దేశం చేస్తుంది.
మీ కాజ వెంకట శ్రీనివాస్ రావు✍️🤝🙏
శ్రీనివాస్ నీ స్పందన కు ధన్యవాదాలండీ.
కృష్ణ మా చారి ,సాంబశివరావు,సాగర్‌రెడ్డి గార్ల గురించిన పరిచయం,మీ ద్వారా వారు వెలుగులోకి వచ్చిన వైనం బావున్నాయి. ఎంతటి ప్రజ్ఞావంతుడైనా పేటికాంతర్గత రత్నము ఓలే యినవాలోక యోగము లేక ప్రకాశింపడు అన్నారు.
ఆ మధ్య sanchika ఆడియో page ఉంటే నా వినిపించేకథలుకి అవకాశం కల్పించమని కోరాను మిమ్మల్ని. మీరు గమనించారు కదా
—–వెంపటి కామేశ్వరరావు హైదారాబాద్.
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
ప్రతిభ, వ్యుత్పత్తి, ధారణ….ఈ మూడు గుణాలు మనిషిలో అంతర్గతంగా వుంటాయి…. కొద్దిపాటి తేడాలతో….వాటికి ప్రోత్సాహం కూడా తోడైతే అంతా పరిమళమే! శుభోదయం!
—–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ హైదారాబాద్.
శర్మ గారూ ధన్య వాదాలు.
Encouraging others to come up in their art is really appreciable and indicates the great nature of the individual.
—Dr.Manjula Hyderabad.
Thank you.
I had gone through it .Good .
——Dr.K.Madhusudan. Visakhapatnam.
Prasad Garu! Meeru naaku GURUVU gaa labhinchadam naa Adrushtam.. Rachanallo melakuvalanu theliyajesthoo , naa prathi rachananu chadivi salahaalanisthoo ,nannu munduku nadipisthunnanduku kruthajnathalu … SANCHKA ku , ALL INDIA RADIO ki,DHARMASHAASHTHRAAM ki ,VEMPATI KAMESWARARAO RAO gaariki ,nannu parichayam chesi, vaari prothsaahaam naaku labhinchetatlu cheshaaru.. Ee roju nenu oka rachayithagaa ,entho kontha vraaya galuguthunnaanante adi Mee chalave.. Mee abhimaanaanni ilaage naapai kalakaalam konasaaginchaalani manaspoorthigaa korukuntunnaanu… 🙏🙏🙏
Note: Paina nannu udaharisthoo abhpraayaalanu theliyajeshina andariki naa DHANYAVAADAALU.. 🙏🙏🙏
అయ్యా… మీ స్పందన కు ధన్యవాదాలండీ .
ప్రసాద్ గారూ, Dr. కృష్ణమాచారి గారు మన మధ్య లేకపోవటం బాధాకరం. సాంబశివరావు, సాగర్ గార్ల దినదిన ప్రవర్ధమానమవుతున్న సాహిత్య సేద్యం చూస్తుంటే ఆనందంగా వుంటుంది. మీ ప్రోత్సాహం అభినందనీయం🙏🏻🙏🏻🙏🏻
ధన్య వాదాలు ఝాన్సీ గారు మీ స్పందనకు.
మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వుంటారు. ఎదుటి వారి నుంచి వారికే తెలియని ప్రజ్ఞను వెలికి తీస్తారు. అది మీ గొప్పతనం. మీ లాంటి వారు అరుదు. మీకు ధన్యవాదాలు.
——ప్రొ.పి.రవి కుమార్ నిట్….వరంగల్
బ్రదర్ మీకు ధన్య వాదాలు.
మీ అభిప్రాయాలతొ ఏకీభవిస్త.ఒక సీనియర్ రచయితను ఒకసారి మరొ సీనియర్ రచయిత అన్నారట నువ్వువరూడా పో టీలకు ఎందుకు రాస్తవు నువ్వునరాస్తే నీపేరు చూడంగనే న్యాయ నిర్ణేతలు అసంకల్పితంగా నీవైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నది .మామూలుగా రాయి .పొటీలకు పంపటం మానేయి అంటే ఆయన ఎంగుకు మానాలె డబ్బులొస్తయికదా ?అనినఎదురుప్రశ్న వేసి ఉంకా పొటీలకు రాస్తునే ఉన్నడు .కన్సొలేషన్ బహుమతి వచ్చినా ఆయన జనైనికి చెప్పుకుంటజు .అంత పేరున్న రచయితకు కన్సొలేషన్ బహుమతి రావటం వర్ధమాన రచయితకు ఉత్తమ బహుమతి రావటం ఒకరకంగా ఆయన రచనలొ పస తగ్గుతున్నందుకు సూచనగా భావించక పొయినా కొత్త వాెళ్ళను ప్రొతేసహించటానికైనా పొటీలకు రాయకుండా ఉంజవచ్చుగదా? గాయకుడు బాలసుబ్రమణ్యంనతన పేరును అవార్డులకు పరిశీలించవద్దని చెప్పాడు ఒకదశలొ .పొటీలొ తనను పరిగణించవద్దు అనివచెప్పి కొత్త వారికి అవకాశమిచ్చాడు. అట్ల రచయితలు చేస్తరా? రచనలొ వారు చూపెడుతున్న ఆదర్శాలు తమ జావితంలొ ప్రతిబింబించక పొవటమే ఎక్కువ.రచనకూ. నడవడికీ పొంతన ఉండక పొవటమే ఎక్కువ చూస్తం.కాళొజీ అంటజు నీ కూ నాకూ వాడికీ కూతల్లొ ఉన్న తేడ చేతల్లొ లేదేమిటి అని చెప్పింది చేయాలనే నిబగ్ధత చాలై మంది రచయితల లొ కనిపించదని చెప్పటానికి సందేహించనక్కర లేదు .మామూలు మనుెషుల కిండే అన్ని అవలక్షణాలు పైరవీలు, జెలసీ, మొదలైమటనవినరచయితల్లొనూ ఉన్నవిఅనటం అతిశయొక్తికాదు.ఇది ఒకరు తెప్తే బాగునకైదు తమ రచనల్లొ ప్రవచిస్తున్నట్టు తమ అంతరంగం లొకి రచయిత చూచుకొగలిగితే. అప్పుజేమైనా మీరన్నట్టు జరుగుతదేమొ? ఒక చిన్న విషయం మీ దృష్టికి తెస్త. కాళొజికి పద్మ విభూషణ్ ఇచ్చినప్పుడు వావిలాలకు పద్మ భూషణ్ ఇచ్చిన్రు .కాళొజా ఏమన్నడంటే వావిలాల నాకంటే పెగ్దవాడు నైకంటే ముందునుంచే ప్రజాజీవితంల ఉన్న వాడు అతనికి పద్మభూషణిచ్చి నాకుపగ్మవిభూషణివ్వటం బాగ లేదు అతనికీ పద్మ విభూషణివ్వ నుండె అన్నడు. అదే పద్మ విభూషణ్ ఆశపడ్డ అతనికి పద్మభూషణ్ వచ్చింది .ఆయనేమన్నడంటే కాళొజీ పద్మ విభూషణ్ తీసుకున్నడు కనుక నేను పద్మభూషణ్ తీసుకున్న. అని అదితేడా. జ్ఞాపకాలపందిరి కొంతమందికైనా కనువిప్పు కలిగిస్తే. సంతొషం.
——నాగిళ్ళ రామ శాస్త్రి హనంకొండ.
శాస్త్రి గారు ధన్య వాదాలు సర్ మీకు
కొత్తవారికి సహకారం అందించాలి.మంచి అంశాన్ని ప్రస్తావించారు.సాగర్ గారి సాహిత్యాన్ని నేనూ ఇష్టపడతాను.మీ ప్రోత్సాహం ఎంతో విలువైనది.ధన్యవాదాలు సర్
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ .
తాను ఎంతో ఎదిగి,ఒదిగి క్రింద మొలకెత్తుతున్న లేత మొక్కల్ని చేతులు చాచి ఆత్మీయ స్పర్శను, ప్రోత్సహాన్ని అందించే మహా వృక్షాలు ఎంతో అరుదు.మా అదృష్టం కొద్దీ మీ వంటి నిస్వార్థ ప్రోత్సహక వ్యక్తిత్వంతో మాకు పరిచయం జరిగింది అనడం అతిశయోక్తి కాదు.మీకెంతో మానసిక తృప్తిని ఇస్తున్న ఈ పని ఎందరో ఔత్సాహిక రచయితలు,కవులకు ఎంతో ప్రేరణను,మార్గ దర్శనాన్నీ అందిస్తున్నది.మీ వంటి మంచి మనసున్న వారు మరెంతో మందిని ప్రోత్సహిస్తూ మరింత సంతోషంగా సాగాలని కోరుకుంటూ…మీ ఆత్మీయ ఆవరణలో నేనూ చివుళ్ళు వేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ…ఈనాడు మీరు పేర్కొన్న మీ స్నేహితులైన పెద్దలకు నమస్కరిస్తున్నా!ఎందరికో ఆదర్శమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్🙏💐
—నాగ జ్యోతి శేఖర్ కాకినాడ.
అమ్మా నీ స్పందన కు ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారు గురువు గారు.మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు.మీరే మాకు ఆదర్శం సార్.
సంగీతం నీ స్పందన కు ధన్యవాదాల ంంంంమ్మా
[25/01, 20:47] Dr. Satyanaraayana D, Perio.: ఎప్పటి లాగానే కథం బాగుంది. ఈ వ్యాసం లో గమనించ దగ్గ విషయం, మీరు రచన నేర్పించిన మీ శిష్యుడు డా. కృష్ణమాచారి, మీ స్నేహితుడు తోట సాంబశివ రావు గారు మరియు సాగర్ రెడ్డి గర్లలో ఉనా మంచి గుణాలను ఎత్తి చూపించారు. అది మీ ఔదార్యం కి నిదర్శనం. మీరు ధన్యులు🙏🏻💐 [25/01, 20:49] Dr. Satyanaraayana D, Perio.: ఒకటికీ నాలుగు సార్లు చదివాను అందుకే ఆలస్యం. క్షమింప ప్రార్థన🙏🏻🙏🏻💐
మీ స్పందన కు ధన్యవాదాలండీ
మీ సాహితి ప్రయాణం బాగుంది.. సీనియర్ కవులు రచయితలు..కొత్త కవులను రచయితలను ప్రోత్సాహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విభిన్నమైన అంశంతో రాసిన మీకు అభినందనలు.
———-శ్రీనివాసా చారి.జి కాజీపేట
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .
స్నేహ సౌరభం విరిసి పరిమళాలు వెదజల్లుతోంది సార్ ఈ ఎపిసోడ్. చాలా సంతోషంగా ఉంది. మీ ఆత్మీయ స్నేహ హస్తాన్ని అందుకున్న కృష్ణమాచారి సార్ మన మధ్య లేక పోవడం బాధాకరం.స్నేహ తీగ తో చక్కని పాదులుగా అల్లి పదుగురు మెచ్చేలాగ చెక్కడం మీకే సాధ్యం సార్ మీ స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంబశివరావు సార్ గారికి, సాగర్ గారికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐
Amma Thank you.
మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. ప్రోత్సాహంతో ముందుకు వచ్చేవారు ఉంటారు. మీరు, శ్రీరంగస్వామి అన్నయ్య లాంటి వారు అందుకు కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు సార్ 🙏✊
——-డా.విద్యాదేవి.ఆకునూరు హనంకొండ
అమ్మా ధన్యవాదాలు.
లతా కవితా వనితా నిరాశ్రయే నశోభంతే అన్నారు మీ ప్రోత్సాహం సమాజానికి మంచి రచయితలను కవులను అందించడం ముదావహం సహృదయతకు నిలువెత్తు రూపం మీరు. వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెప్పడం కూడా మీ సొత్తు మీరు వెన్ను తట్టిన వారు వెన్ను విఱచుకొని సాహితీవనంలో విహరించడం మీకు మాకూ గర్వకారణం పుత్రాధిచ్చేత్ పరాజితం
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™