ఒకటి అడగాలని ఉంది.,లేదా ప్రశ్నించాలనీ ఉందిఅసలు.,ఈ భూమి ఇంత అందంగా.,జీవితం మీద ఆశ అమాంతంగాపెరిగిపోయేంతగా ఎందుకు అలంకరించబడింది?ఎవరి కోసం?
మరి., వాళ్ళ ముఖాల్ని అధ్ధంలో చూపానో లేదో.,వాళ్లంతా అధ్ధం ముందుతమ కొత్త ప్రతిబింబాలని చూస్తూ.,అలిగి కూర్చుండి పోయారు.
ఈ లోకంలో శత్రువులతో పైపైన కలిసిపోవచ్చు.,కానీ కడకు మిత్రులే కదా హృదయాశ్రయం ఇచ్చేది?
ఈ భూమ్మీద కొద్ది మంది జీవితపు అదృష్టాన్ని ఏమని చెప్పాలి..,?అనగనగా ఒక సీత ఉండేది సుమా., చెప్పాలంటే.,ఎంత మంచిదని.. ఈ భూమి అంత సహన శీలి ఆ సీత.,!మరి.,ఆమె ఎంత కష్టాలపాలు చేయ బడిందో కదా.,?
ఈ భూమి మీద జాతి., జాతంతాయుగాలుగా ., కొద్ది పాటి కారుణ్యం కోసం నిరీక్షిస్తూఉండడం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన విషయం కానే కాదు సుమా.,!
నేనేమీ అవతార పురుషుణ్ణి కాను.,ప్రవక్తను అంతకన్నా కానుమరి నాకు ఈ అందమైన భూమిని వ్యాఖ్యానించేంతగౌరవం ఎందుకు ఇవ్వబడిందో అర్థమే కాదు.
జీవితమంతా వనవాసంలోగడిపేసాక.,సిలువ మీద నాకు మృత్యువు దొరికిందని మీకు ఎలా చెప్పను?ఇన్ని కష్టాలు.,కన్నీళ్లు ఉండగా కూడా.,అసలు ఈ భూమి ఇంత అందంగా అలంకరించబడి.,నాకు జీవితం మీదఅమాంతంగా ఆశ పెరిగి పోయేట్లు ఎందుకు కనపడాలి??
మూలం: సాహిర్ లుథియాన్విస్వేచ్ఛానువాదం: గీతాంజలి
బాగుంది, కానీ దీనికి మూలమయిన హిందీ కవిత కూడ ఇస్తే గాని దీని అందాన్ని పూర్తిగా ఆస్వాదించలేము.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™