సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    యామినీ దేవి కోడే

    నడుస్తునే ఉన్నా.. జీవిస్తూనే ఉన్నా
    కల కలలాగానే ఉంది
    ప్రేమ ప్రేమగా లేదు..
    నన్ను ఆలోచనల్లో పడేసిన మాటలవి.

    ఏది జరిగినా అల్లుకునేది వేధనాలతే..
    గోడమీద పిల్లి వాటం మనిషి జీవితంలో .
    భిన్న సందర్భాల్లో లోకం పోకడఎలా ఉంటుందో చెప్పారు..
    మౌనం లోని శక్తినీ అందులో బలాన్ని
    ఇంకిత ప్రవాహాన్ని కన్నాను.

    పాదచారి లో ఉన్న అసంఖ్యాకమైన భావాల్ని విప్లవ మూర్తి చూసాననడం హద్దులు ఏర్పరచినా నీతోనే ఉన్నాననడం.. పాదచారి మనసుని ఆ పాత్ర తో మాకు మరింత ఎరుక చేయడం బావుంది.

    తర్వాత పాత్ర అమృతతో సంభాషణలో లోకం పోకడ స్వభావాలు చర్చ బావుంది.
    లోకం గిల్లి నవ్వుతుంది అన్న తర్వాత
    కళ్ళు పదాల వెంట పరుగులు తీసాయి.
    ఒక్కో పదం తర్వాత కొద్ది కొద్దిగా మౌనం మనసుని ఆవహించింది.

    కాలం నా బానిస తెలుసా..
    కాలం శరీరాన్ని శాసించగలదు..
    నా ఆత్మను కాదు అనే సత్యాన్ని పాదచారి పాత్ర మాకు చెప్తుంది.

    పాదచారి మరలా నడుస్తూ వెనుతిరుగినప్పుడు స్వభావాలు అన్ని పాత్రలు ద్వారా తనలో చేరిపొమ్మని ఆహ్వానించడం బావుంది.
    విశ్వాసం కుక్కపిల్ల కూడా నడుస్తోంది..
    నడక సాగుతూ ఉంది.
    మేము మరో సంచికకై ఎదురు చూస్తూ ఉన్నాం.

    Reply
  2. 2

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది లేళ్ల పల్లి శ్రీదేవి రమేష్ గారి స్పందన
    మీరు రాసింది చదువుతున్న ప్రకృతి వాస్తవిక విషయాలను చదువుతుంటే కళ్ళముందు మీరు రాసిన, కొంగ,కప్ప, కాకి,చేప,ఆవు,పచ్చటి గరిక,గడ్డిపూలు,చంద్రుడు,సూర్యుడు,కొండలు,
    కోనలు, మబ్బులు ,వర్షం ఇలా అన్నీ కళ్ళు మూసుకుని సంతోషంతో నా మనోనేత్రంతో చూసాను.మానసికొల్లాసంపొందాను. ప్రశాంతంగా ఆత్మానందం పొందే సమయంలో హఠాత్తుగా ఒక శబ్దం నన్ను ఆటంక పరిచి నా ఆత్మానందాన్ని దూరం చేసినట్టు అనిపించింది. ఆ శబ్దం పక్షులపై రైఫిల్ తో దాడి చేస్తున్న మన మానవ జాతిలోని ఒక మనసు లేని మనిషి చేస్తున్న భయంకర శబ్దం, వెంటనే వలలతో చేపలు పట్టే వారి మాటలు,ప్రయోగశాలలో కప్పులను కోసి ప్రయోగం చేస్తూ మాట్లాడుతున్న శాస్త్రవేత్తల మాటలు.
    ఒక్క క్షణం దుఃఖం తో మనసు గాయపడింది. ప్రకృతి అందులోని పశుపక్షాదుల తెలిసి,తెలియక కూడా మనుషులకు కానీ ప్రకృతికే కానీ ఏమాత్రం హాని చేయవు. మరి మన మనుషులు ఎందుకు తెలిసికూడా హానిచేస్తున్నారు అని?
    మరి మన మానవ జాతి ఎటు వెళ్తుందో కూడా తెలియనంత ,పురోగమనం అనుకుంటున్న దిశకు వెళ్ళడం పక్కన పెడితే ఉచితంగా దేవుడు మనకు ప్రసాదించిన అమూల్యమైన ప్రకృతి సంపదను అందులోని.సూర్యచంద్రులను,భూమి,ఆకాశం,
    పశుపక్షాదులను,పూలు,పండ్లను,నదులను,పచ్చని పొలాలను వేటిని మనం మన గొప్ప మేధస్సు అనుకునే పనితో విషపూరితం చేస్తున్నాము. ప్రకృతికి రుణం తీర్చుకోవాల్సిన మనం ప్రకృతిని దానిలోని జీవరాసులను, అడవులను,నదులను అన్నింటినీ ధ్వంసం చేస్తున్నాము. ఇది అజ్ఞానం తో కాదు మితిమీరిన విజ్ఞానంతో.

    సర్ మీ ప్రకృతి రచనలు నాకు మానసిక ఆనందం తోపాటు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్న నాకు బాధ్యతను కూడా పెంచాయి. నాకే కాదు మీ “పాదాచారి” ఎందరో మనసులలో మార్పు తీసుకుని రాగలదు.స్వతహాగా ఆలోచించి ప్రకృతికి మంచి చేయడానికి పూనుకోవచ్చు. మీకు హృదయపూర్వక అభినందనలతో నమస్సులు సర్.

    Reply
  3. 3

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది Dr gali raajeswari గారి spandana పాదచారి–7
    జీవితము, ఆధ్యాత్మికము పరస్పరసంబంధులు,పరస్పరపోషకులు..ఇదిచర్చనీయాంశంకాదు. అనుభవైకవేద్యం(అనుభవించతగినది).ఆధ్యాత్మికజ్ఞానము,దానమూ నిశ్శబ్ద క్రియ.
    ఏక్షణానికి ఆ క్షణం మనో తరంగాలుతీవ్రంగాచలిస్తుంటాయి.అదే మనసు లక్షణం. దానిఫలితంగానే క్షణంలో గెలిచాననీ,క్షణంలో ఓడాననీ అనుకుంటాం..పాదచారి కూడ అందుకు మినహాయింపు కాదు..(అలరచంచలమైన ఆత్మలందుండ నీఅలవాటుచేసెనీఉయ్యాల!……అనిన అన్నమయ్య మాట నిజం)
    ఐతే మనలను మనం మరిచి పోవడానికి,కోల్పోవడానికీ, వెతుక్కోవడానికీ..సర్వానికీ
    ప్రకృతే శరణ్యం. అందుకే చెట్టూ,పుట్టా,పిట్ట.. వెంట పాదచారి పరుగులు..అతని ప్రకృతే(ప్రవృత్తే) ఆరుద్ర ను ఆస్వాదిస్తూ కాస్త చేయూతనిమ్మని దీనంగా అర్థిస్తుంది..అడుగడుగునా వెంటాడుతూ వేటాడుతున్న అరిషడ్వర్గాలనువిదుల్చుకుంటూ,..మళ్ళీ కాసేపటికి వాటిని పరామర్శిస్తూ సాగిపోయే పాదచారి గమ్యాన్ని చేరుకుంటాడా!!?? పట్టు వదలని ఈ విక్రమార్కుని కి ఆత్మవిశ్వాసమే రక్ష! తోడూ నీడ! ……ఈ భాగంలో పాదచారి ప్రయాణ ‘పదనిస’ ల్లో
    గోడ మీది పిల్లి ప్రత్యేకం.. లోతైన ఆలోచనకు దారితీసింది..ఎవరికైనా వున్నవి రెండే అవకాశాలు కదా!? ఈభాగానికి సంబంధించి ఇంకొన్ని అభిప్రాయాలను ఇంకోసారి……🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    Reply
  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది కోడే యామినీ దేవి గారి స్పందన
    డుస్తునే ఉన్నా.. జీవిస్తూనే ఉన్నా
    కల కలలాగానే ఉంది
    ప్రేమ ప్రేమగా లేదు..
    నన్ను ఆలోచనల్లో పడేసిన మాటలవి.

    ఏది జరిగినా అల్లుకునేది వేధనాలతే..
    గోడమీద పిల్లి వాటం మనిషి జీవితంలో .
    భిన్న సందర్భాల్లో లోకం పోకడఎలా ఉంటుందో చెప్పారు..
    మౌనం లోని శక్తినీ అందులో బలాన్ని
    ఇంకిత ప్రవాహాన్ని కన్నాను.

    పాదచారి లో ఉన్న అసంఖ్యాకమైన భావాల్ని విప్లవ మూర్తి చూసాననడం హద్దులు ఏర్పరచినా నీతోనే ఉన్నాననడం.. పాదచారి మనసుని ఆ పాత్ర తో మాకు మరింత ఎరుక చేయడం బావుంది.

    తర్వాత పాత్ర అమృతతో సంభాషణలో లోకం పోకడ స్వభావాలు చర్చ బావుంది.
    లోకం గిల్లి నవ్వుతుంది అన్న తర్వాత
    కళ్ళు పదాల వెంట పరుగులు తీసాయి.
    ఒక్కో పదం తర్వాత కొద్ది కొద్దిగా మౌనం మనసుని ఆవహించింది.

    కాలం నా బానిస తెలుసా..
    కాలం శరీరాన్ని శాసించగలదు..
    నా ఆత్మను కాదు అనే సత్యాన్ని పాదచారి పాత్ర మాకు చెప్తుంది.

    పాదచారి మరలా నడుస్తూ వెనుతిరుగినప్పుడు స్వభావాలు అన్ని పాత్రలు ద్వారా తనలో చేరిపొమ్మని ఆహ్వానించడం బావుంది.
    విశ్వాసం కుక్కపిల్ల కూడా నడుస్తోంది..
    నడక సాగుతూ ఉంది.
    మేము మరో సంచికకై ఎదురు చూస్తూ ఉన్నాం.

    Reply
  5. 5

    అల్లంశెట్టి సత్యనారాయణ

    ఎనిమిది భాగాలు చదివాను. లేళ్లపల్లి శ్రీదేవిరమేష్ గారు ప్రకృతి గురించి చేసిన వ్యాఖ్యానాలు ‘పాదచారి’ సీరియల్ కి సరిగ్గా నప్పాయ్.

    Reply
  6. 6

    కస్తూరి మురళీ కృష్ణ

    గాలి రాజేశ్వరి గారి అభిప్రాయం ఇది

    పాదచారి–7….కు రెండో స్పందన… ”కాలం నా బానిస.ఎందుకో తెలుసా? కాలం నా శరీరాన్నే శాసించగలదు.నా ఆత్మను కాదు”…..కాలానికి భాష్యం చెప్పడమంటే ఇదే కదా…అనుభవాల బరువును దింపుకునే ప్రయత్నం..అయితే తుదిక్షణం దాకా అనుభవాలు తామరతంపలుగా పుట్టుకొస్తూనే వుంటాయి. వాటి జాడలనే తోడుగా నీడగ చేసుకుని నడుస్తూ జీవించాలి.అందులో భాగమే ఇంటగెలిచి రచ్చ గెలవడం..అంటే అంతఃశ్శత్రువులను జయించినవారే బాహ్యప్రపంచాన్ని జయించ గలరు.. ఆత్మవిశ్వాసం తోడుగా సాక్షిగా ఈవిజయాన్ని సాధించి ఆత్మౌన్నత్యపు రహస్యాన్ని నిరూపించిన వసువాంశ గా చెప్పక తప్పదు…….”కాలం నా బానిస…..”ఎంత ధీమా!?…..అనుభవపూర్వకమైన లోకరహస్యాలను నిగూఢంగా వుంచుకుంటూ తననుతాను దాచుకునే ప్రయత్నం లో అప్రయత్నంగా వెలువడిన శబ్దరూపమిది..పాదచారి దారితప్పిన బాటసారి కాదు..తాపసధర్మపథికుడు..అణ్వేషనోత్సాహి
    శరీరం చలనశీలి..మనసుకూడ నలకడలేనది.ఐతే ఆత్మ చలించని నిత్యసత్యం.అది సర్వంసహా చక్రవర్తి. శరీరమూ మనసూ కాలవశాలు…కానీ ఆత్మ అమరం…ఆయువుకు కర్త.ఆత్మ ప్రయాణం లో మృత్యువు ఒకమజిలీ..కాసేపు ఆగి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దానిపేరే శుమైతాంగి..ఆత్మ పయనం జన్మవైపుకే…ఆత్మ వెంటే వాసనలు…ఆత్మ నేస్తం విశ్వాసం….మనిషి ఆత్మ విశ్వాసంతో నడుస్తూ జీవిస్తూ……..జీవిస్తూ నడుస్తూ….జననమరణాలవెంట నడిచితీరాలి కదా….
    [01/10, 12:34] Bhuvanachandra: జీవితం,కలలు,–కవలపిల్లలనుకుంటా. జీవితంలో జీవాన్ని నింపేవి కలలే! ఐతే కలలు రెండు రకాలు.మెలకువగా వున్నపుడు కనే కల పగటి కల.నిద్రలో కలలు రెండోది. ఎవరి కలలు వారివే..ఎవరికలకు ఎవరూ కర్త కాదు..నిజమయ్యే కలలు కొన్ని..ఫలించని కలలు కొన్ని. అందరికీ అన్నీ కలబోసే వుంటాయి.ఫలిస్తే ఎగిరి గంతులేయడం,ఫలించకపోతే కుంగిపోవడం మనిషి నైజం. కల,కల్లైనా,ఫలించినా, నిజం నిజం కాకపోదు.వివేకి వాస్తవాన్నే ఆశ్రయించి దాని వెంటే నడుస్తాడు..ఫలించని కల,ఫలించినకల..రెండూ మనవే.అన్నీ మనవే.. కాకపోతే సందర్భానుసూరంగా వాటి వెంట నడవాలి…పిల్లి గోడ ఎక్కకపోదు. గోడెక్కినపిల్లి ఏదోవైపుకు దూకక మానదు..జన్మ గోడెక్కినపిల్లి..ఇహంవైపుకు లేదా పరం వైపుకు,..వాస్తవం లేదా అవాస్తవం…ఏదోవైపుకు దూకి తీరాల్సిందే….

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!