సంచికలో తాజాగా

My Profile

Close
Profile Details
శివకుమారి
దాసరి

శ్రీమతి దాసరి శివకుమారి హిందీ ఉపాధ్యాయినిగా పని చేసి పదవీ విరమణ చేశారు. తెనాలిలో వుంటున్నారు. నవల కథ, వ్యాసములు, బాల సాహిత్యము, హిందీ అనువాద సాహిత్య ప్రక్రియలలో కృషి చేస్తున్నారు. వందకు పైగ కథలు, అయిదు నవలలు, అనేక అనువాదాలు చేశారు.
వీరి రచనలు అనేక ప్రింట్, వెబ్ మ్యాగజైన్‍లలో ప్రచురితమయ్యాయి. రేడియో కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు.
అమ్మకు వందనం, ఆమని, కర్మయోగి, గౌరమ్మ గెలుపు, ధర్మం శరణం గచ్ఛామి వీరి నవలలు. ఆటవిడుపు, ఆదివారం సందడి, చెన్నై బామ్మ వీరి కథాసంపుటులు. కిచ కిచ, కోతి జామచెట్టు, బాలల వినోద కథలు అనునవి వీరి బాల సాహిత్యపు రచనలు. విశాలాంధ్ర, పల్లవి, ప్రజాశక్తి, మంచి పుస్తకం, జనవిజ్ఞానవేదిక, గుళ్ళపల్లి సేవా సంస్థ, కన్నెగంటి ఫౌండేషన్ లాంటి సంస్థలు వీరి రచనలు ప్రచురించాయి.
'అమ్మకు వందనం' అను నవల కడప వారి కవితా సాహిత్య జాతీయ పురస్కారాలలో కందుకూరి నవలా పురస్కారాన్నీ; 'సంఘర్షణ' అను కథ నవ్య వారపత్రిక వారి బహుమతిని, 'రక్షణ' అను కథ సంచిక వెబ్ పత్రికలో బహుమతిని పొందాయి. ఆలపాటి కళాపీఠం వారి (మిసిమి) పురస్కారాన్ని, బొల్లిముంత శివరామకృష్ణ గారి స్మారక పురస్కారాన్ని సాహితీవేత్తగానూ, ఉపాధ్యాయినిగా పలు మార్లు పురస్కారాలను పొందారు.

Social Profiles
Account Details

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!