న కుర్యాత్ కలహం స్త్రీభిః బాలై స్సహ న చింతయేత్ । న త్యజేదుత్తమం శీలం న కుర్యాత్ స్వామి గర్హణమ్ ॥
ఆటవెలది : తగవు లాడ తగదు తరుణీ మణుల తోడ చిన్న వారి తోడ చింత తగదు తుంచి వేయ తగదు మంచి బుద్ధు లెపుడు ప్రభుని యెపుడు కించ పరుచ తగదు ౧౧౧
***
గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనమ్ । విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః ॥
ఆటవెలది : పెంచు కొనుము యెపుడు మంచి గుణములు మిడిసి పడుట యెపుడు మేలు గాదు వెడల రెవరు యెపుడు మెడ గంటలను జూచి వట్టి గోవు కొనగ వసుధ యందు ౧౧౨
కరావివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణీ । అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే ॥
తేటగీతి : కరము లెప్పుడు తనువును కాచు నటుల కనుల నెప్పుడు రెప్పలు కాచు సరణి ఆదు కొందురు మిత్రులు అడగ కుండ చెలగి కడగండ్ల సమయాన చేయి చాచి ౧౧౩
దుర్జనేన సమం సఖ్యం ప్రీతిం చాపి న కారయేత్ । ఉష్ణో దహతి చాంగారః శీతః కృష్ణాయతే కరమ్ ॥
ఆటవెలది : చెడ్డ వారి చెలిమి సేయంగ ముప్పురా వారి చెంత నున్న వలచు ముప్పు కాలుచున్న బొగ్గు కాల్చి వేయును తాక మండ నట్టి బొగ్గు మసిని పూయు ౧౧౪
శ్రోతవ్య ముక్త మన్యేన శ్రుత్వా సమ్యగ్విచారయేత్ । విచారేణైవ కర్తవ్యః సత్యాసత్య వినిర్ణయః ॥
ఎవరు చెప్ప నేమి? ఏ విషయంబేని? వినుట మేలు సుమ్ము విశద గతిని వినిన దాని నంత విపులంగ యోచించి నిర్ణయించ వలెను నిజము యెంతొ ౧౧౫
చాల బాగున్నాయి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™