వారాల ఆనంద్ రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.
~~
1) ఎప్పుడో ఒక సారి పలకరిస్తావు నేనేమో పలవరిస్తాను మన సంభాషణ నిరంతరం కొనసాగుతుంది ~ ~ 2) నువ్వంటే ఎంతో ఇష్టం… అంతే కోపం కూడా కనిపించి మురిపిస్తావు కనిపించక కరిగిస్తావు.. కన్నీటినిస్తావు ~ ~ ౩) దశాబ్దాలు నడిచాయి.. శతాబ్దాలు గడుస్తాయి నువ్వు నిజం, నేను నిజం ఇద్దరి నడుమా నిశ్శబ్దం మరింత నిజం ~ ~ 4) నువ్వు మాట్లాడతావు నాకు వినబడుతుంది చెవిలో నిలబడుతుంది కానీ నీ చిన్న నవ్వే హృదయాన్ని చేరుతుంది ~ ~ 5) నువ్వు కనిపించగానే ఎక్కడెక్కడినుంచో మెరుపులా వెలుగొచ్చి నా కళ్ళల్లో చేరుతుంది కమ్ముకున్న మబ్బులు కరిగి చినుకులు కురుస్తాయి ~ ~ 6) నీలోనూ నాలోనూ నిండయిన ప్రేమ, నిలువెత్తు భయం రెండు తీరాల నడుమ ప్రవాహంలా
WOw.. Beautiful… మాటల్లేవు…👏👏💐💐💐😊🙏 -డాక్టర్ విష్ణు వందనా దేవి
Excellent, touching sir…💐💐 Dr.VELDANDI SRIDHAR
అనుభూతులు అనుభవాలు… కలగలిపి వడ్డించారు… చాలా బాగున్నాయి సార్ 🙏 ఏ. నాగాంజనెయులు కవి కర్నూల్
చాలా బాగున్నాయి – ఉదారి నారాయణ, కవి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™